నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నవంబర్ లో ఎస్ ఎస్ సి పరీక్షలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా వివిధ రిక్రూట్ మెంట్ పరీక్షల షెడ్యూల్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిందని అధికారులు తెలిపారు. నవంబర్ మాసంలో నిర్వహించనున్న మూడు కీలక పరీక్షల తేదీలను అధికారికంగా ప్రకటించారు. కోస్ట్ గార్డ్, డిపార్ట్ మెంటల్ టైపింగ్ టెస్ట్ లతో పాటు ఢిల్లీ పోలీస్ ఎస్ ఐ పరీక్షల తేదీలను వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.