రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పల్లిపాడు విద్యార్థినుల ప్రతిభ
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. మార్కాపురంలో జరిగిన ఈ టోర్నీలో శ్రావ్యకు 'స్టార్ ఆఫ్ ఆంధ్ర' అవార్డు దక్కింది. శ్రావ్య, కావ్యశ్రీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 3 నుంచి ఛత్తీస్గఢ్లో జరిగే నేషనల్స్ లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.