యువతకు ఫిన్లాండ్ అదిరిపోయే బంపర్ ఆఫర్: ఫ్రీగా విదేశీ పర్యటనతో డేటింగ్ చేసే గోల్డెన్ ఛాన్స్

రిపోర్టర్: రాము స్థలం: హెల్సింకి

జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న యువతకు ఫిన్లాండ్ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమం ద్వారా అద్భుతమైన అవకాశం కల్పిస్తోందని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెన్ జీ సింగిల్స్ కోసం ఫిన్నిష్ డిన్నర్ డేట్ పేరుతో టూరిజం ప్రచార క్యాంపెయిన్ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంపికైన పదహారు మందికి ఉచితంగా ఫ్లైట్ టికెట్లు, లగ్జరీ వసతితో పాటు హెల్సింకి వీధుల్ లో విహరించే సువర్ణావకాశం లభిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.