ఓవర్సీస్‌లో ది ప్యారడైజ్ సినిమా దూకుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ది ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందే నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. ఇప్పటికే అక్కడ ఈ చిత్రం 7.5 లక్షల డాలర్ల గ్రాస్ మార్క్‌ను దాటడంతో, 1 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తోంది. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.