ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 28 జిల్లా ప్రజా పరిషత్‌ల ఏర్పాటు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం 28 కొత్త జిల్లా ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 24 తర్వాత ఇవి అమల్లోకి రానున్నాయి. దీనికోసం 30 కీలక పోస్టులను సృష్టించడంతో పాటు, 660 మండల ప్రజా పరిషత్‌లను కొత్త జిల్లాల పరిధిలోకి మ్యాపింగ్ చేయనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కలెక్టర్లు, అధికారులకు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది.