ముంబైలో తెలుగు సమాజ మిత్ర మండల్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ ఉత్సవాలు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా ముంబైలో తెలుగు సమాజ మిత్ర మండల్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 14న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆరు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొని కుంకుమ పూజలు, భజనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. చివరి రోజు కోలాటాలు, నృత్యాలతో గణేష్ విసర్జన ఘనంగా ముగిసింది.