అక్రమ కేసులపై మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నించాలన్న అంబటి రాంబాబు

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

మంత్రి నారా లోకేష్ ఇచ్చే జాబితాల ఆధారంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఏకపక్షంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తే తామే స్వచ్ఛందంగా స్టేషన్‌కు వస్తామని సవాల్ విసిరారు. తప్పుడు కేసులతో భయపెట్టి తమ గొంతు నొక్కలేరని, పోలీసుల వైఖరికి నిరసనగా ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.