రాప్తాడు ఉన్మాది హేమంత్ ఆరోగ్యంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి కీలక ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: అనంతపురం
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి ఉన్మాది హేమంత్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. పోలీసు కాల్పుల్ లో గాయపడిన నిందితుడి కుడి కాలుకు రక్తప్రసరణ జరగక కుళ్లిపోయిందని, కాలు సగ భాగం తొలగించే అవకాశం ఉందని తెలిపారు. ఎక్స్రే రిపోర్టు మరియు అనస్తీషియా వైద్యుడి నివేదిక పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.