నంది అవార్డుల ప్రకటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కీలక ప్రకటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డులపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నెలలో అవార్డుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్లో విజేతలను ప్రకటించి, డిసెంబర్లో ఘనంగా అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో టాలీవుడ్ వర్గాల్లో మరియు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డుల ప్రదానంపై ఎదురుచూపులకు తెరపడింది.