నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమైన ఓటర్ల జాబితా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీ ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 72 వార్డుల్లో 4,89,351 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. డివిజన్ల పునర్విభజనతో వార్డులు 54 నుండి 72కు పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ ఓటర్ల జాబితాను వార్డు సచివాలయాల్లో ప్రచురించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.