జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానన్న ప్రముఖ బాక్సర్ మేరీకోమ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: మణిపూర్

బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ తన జీవితంలోని అత్యంత కష్టకాలం గురించి భావోద్వేగంతో పంచుకున్నారు. ఒక దశలో తాను ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తన చిన్న పిల్లల కోసం ప్రాణాలతో నిలబడ్డానని తెలిపారు. రింగులో అత్యంత బలశాలిగా కనిపించే తాను, ఆ సమయంలో పూర్తిగా కుంగిపోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా జీవితంలో ఎన్నో త్యాగాలు చేసినట్లు చెప్పారు.