చెన్నైలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారుల తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: చెన్నై

చెన్నై పట్టినపాక్కంలోని శీనివాసపురం వద్ద కొత్త సచివాలయం నిర్మించడానికి ఒక్క ఇటుక పెట్టినా సహించేది లేదని పరిసర ప్రాంతాల మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని, తమ జీవనాధారం దెబ్బతింటే ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదిత నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలు మత్స్యకార గ్రామాలు ఏకమై ఆందోళన బాట పట్టాయి.