నాలుగు రోజుల్లో 8.5 కోట్ల వసూళ్లు సాధించిన రోమాంచకం

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన 'రోమాంచకం' సినిమా నాలుగు రోజుల్లోనే 8.5 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర సక్సెస్ మీట్ లో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ, దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి హాస్యాన్ని చాలా బాగా పండించారని ప్రశంసించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉన్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.