మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో భక్తిశ్రద్ధలతో గణపతి హోమం
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంగళవారం రోజున హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.