ఈసీ తీరుపై ఇండియా కూటమి నిప్పులు: సోమవారం భారీ నిరసనకు పిలుపు
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
ఓటర్ల జాబితా సవరణలోని అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సోమవారం జాతీయ రాజధానిలో భారీ నిరసనకు ఇండియా కూటమి సిద్ధమైంది. అమిత్ షా పోలీసుల అణచివేత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. యువత గొంతు నొక్కాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, సోమవారం జరిగే ఆందోళనలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.