వినాయక మంటపాల ఏర్పాటుకు ఆన్లైన్లో ఉచిత అనుమతులు

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

వినాయక చవితి సందర్భంగా మంటపాల ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఎటువంటి రుసుము లేకుండానే అనుమతులు పొందవచ్చని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. దరఖాస్తుదారులు వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి నిరభ్యంతర పత్రం పొందాలి.

నిర్వాహకులు అనుమతి పత్రాలను, నిబంధనల బుక్లెట్ను ప్రింట్ తీసుకుని మంటపం వద్ద ఉంచాలి. పోలీసులు తనిఖీ సమయంలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని ఎస్పీ కోరారు.