పాడేరు గిరిజన విద్యార్థిని భవ్యశ్రీకి ఎంబీబీఎస్ సీటు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాడేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సంగోడి గ్రామానికి చెందిన మసాడ భవ్యశ్రీ ఎంబీబీఎస్లో ప్రవేశం సాధించారు. శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దక్కించుకున్న భవ్యశ్రీని గ్రామస్తులు, సంఘం ప్రతినిధులు ఘనంగా అభినందించారు.
గిరిజన ప్రాంతం నుంచి వైద్య విద్యలో రాణిస్తున్న భవ్యశ్రీ పట్టుదలపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో ఆమె గొప్ప వైద్యురాలిగా ఎదిగి, సమాజానికి సేవలందించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ విజయం మండలంలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.