దులీప్ ట్రోఫీ ఫైనల్: వైస్ కెప్టెన్‌గా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Chennai

15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతకు సిద్ధమయ్యాడు. చెన్నైలో జరగనున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇషాన్ కిషన్ సారథ్యంలో ఆడనున్న వైభవ్, తన కెరీర్‌లో తొలిసారి ఐదు రోజుల ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడబోతున్నాడు. సెమీఫైనల్లో హాఫ్ సెంచరీతో రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు, ఫైనల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.