న్యూయార్క్ సబ్ వే రైలు కింద పడి ఇద్దరు భారతీయ సంతతి యువకులు దుర్మరణం

రిపోర్టర్: సతీష్ స్థలం: World

న్యూయార్క్ నగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన 24 ఏళ్ల యువకులు ప్రాణాలు కోల్పోయారు. మ్యాన్‌హాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ స్టేషన్‌లో సబ్ వే ట్రాక్‌పై కూర్చున్న వీరిని వస్తున్న రైలు ఢీకొట్టింది. మృతులను మలైకా చిత్రే, నవం కౌల్‌గా గుర్తించారు. వీరు రూట్‌జర్స్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు. ట్రాక్‌పైకి ఎలా వెళ్లారనేదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.