అంతర్జాతీయ మార్కెట్లో వివో ఎక్స్ ఫోల్డ్ 6 గ్లోబల్ ధర వెల్లడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలో విడుదల చేయనున్న ఎక్స్ ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ధర మరియు ఫీచర్లు యూరోపియన్ రిటైలర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లీకయ్యాయని టెక్ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఫోన్ సుమారు రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల ధరతో రానుందని, బ్లూ అలాగే బ్లాక్ రంగుల్లో లభిస్తుందని టెక్ వర్గాలు వెల్లడించాయి. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో పాటు మెరుగైన ఫీచర్లతో త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి ఈ ఫోన్ రానుందని సమాచారం.