యాదగిరిగుట్ట లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట పట్టణంలోని లాడ్జిలలో మంగళవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరైన రికార్డులు నిర్వహించని లాడ్జి యజమానులపై కేసులు నమోదు చేస్తామని టౌన్ సీఐ భాస్కర్ హెచ్చరించారు. లాడ్జిల్లో తప్పనిసరిగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని యజమానులకు సూచించారు.