రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయన్న డీజీపీ ఆనంద్

రిపోర్టర్: అశోక్ స్థలం: Telangana

రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, అత్యంత భారీ స్థాయిలో కొనసాగుతున్నాయని తెలంగాణ డీజీపీ శ్రీ సి.వీ. ఆనంద్ వెల్లడించారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంతో పాటు సీయూఆర్ఈ ప్రాంతంలో నిమజ్జనాల వేగం భారీగా పుంజుకుందని స్పష్టం చేశారు. పోలీసు శాఖ పర్యవేక్షణలో అన్ని భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు తెలిపారు.