ఈశ్వర్ సాయి వివాదం: భర్తపై సంచలన ఆరోపణలు చేసిన శరణ్య
రిపోర్టర్: సునీల్
స్థలం: రాజన్న సిరిసిల్ల
యూట్యూబర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య వివాదంపై భార్య శరణ్య స్పందించారు. ఘటన రోజున కోపంతో ఇద్దరినీ కొట్టానని, పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. ఈశ్వర్-మాధురిల లీక్డ్ ఆడియోపై ఆవేదన వ్యక్తం చేస్తూ, తన కొడుకు భవిష్యత్తు కోసం ఈ వేదన భరిస్తున్నానని తెలిపారు. వేములవాడ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కేసు నమోదు చేయలేదని, ఈశ్వర్ తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాడని ఆమె పేర్కొన్నారు.