అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహబూబ్‌నగర్ యువతికి కిడ్నీ మార్పిడి కోసం రూ.25 లక్షల సాయం కోసం నిరీక్షణ
రిపోర్టర్: గోపి
స్థలం: మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం పెద్దకడుమూరుకు చెందిన గజలప్ప దంపతుల రెండో కూతురు వేదావతి అరుదైన సిస్టెమిక్ ల్యూపస్ ఎరితెమాటోసస్ వ్యాధి బారిన పడి కిడ్నీలు దెబ్బతిని మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలో చదువుకుని ప్రైవేటు ఉద్యోగం చేసిన ఆమెకు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పేదరికంతో సతమతమవుతున్న ఆ కుటుంబం బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కన్నీరుమున్నీరవుతూ వేడుకుంటున్నారు.