సీఎం సహాయనిధితో కిడ్నీ బాధితునికి ఆర్థిక భరోసా
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన గొడుగు బాలయ్య కుమారుడు హర్ష కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవతో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.50 లక్షల ఎల్ఓసీని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీటీసీ శివప్రసాద్ అందజేశారు. రోబోటిక్ చికిత్స కోసం ఈ ఆర్థిక సాయం అందించడం పట్ల బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.