ఫ్రాన్స్ లో తీవ్ర ఉద్రిక్తత: పదవి నుంచి తప్పుకోవాలని అధ్యక్షుడు మెక్రాన్ పై ఒత్తిడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Paris
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పదవిపై తీవ్ర ఒత్తిడి నెలకొందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దేశంలో నిరసనలు ఉధృతమవుతుండటంతో పాటు ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. ఈ రాజకీయ అస్థిరత ఆయన నాయకత్వానికి తీవ్ర సవాల్‌గా మారుతోందని, ఆందోళనకారులు నేరుగా అధ్యక్ష పదవినే లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేస్తున్నట్లు ఆ దేశ రాజకీయ వర్గాలు స్పష్టం చేశాయి.