వైకల్యాన్ని జయించి క్రికెట్ రంగాలో దూసుకెళ్తున్న ఉమ్మడి గుంటూరు దివ్యాంగులు

రిపోర్టర్: రాము స్థలం: గుంటూరు

శారీరక సవాళ్లను ఎదుర్కొంటూ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు దివ్యాంగ క్రీడాకారులు క్రికెట్లో రాణిస్తున్నారని దివ్యాంగ క్రికెటర్ నందం సాయి తెలిపారు. నందం సాయి, కాకనూరి శ్రీనివాసరావు, తియ్యగూర కిషోర్ రెడ్డి, షేక్ కరీముల్లా తమ పట్టుదలతో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపికయ్యారు. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ విధిని ఎదిరిస్తున్న వీరు భారత జట్టుకు ఆడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.