కార్ల్ లాగర్ఫెల్డ్ ప్రైజ్ అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా జోనాస్ ప్రతిష్టాత్మక 'కార్ల్ లాగర్ఫెల్డ్ ప్రైజ్' అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. పారిస్‌లో జరగనున్న ఈ వేడుకలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. యువ ఫ్యాషన్ డిజైనర్లను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో, ప్రియాంక ఫస్ట్ రన్నరప్‌కు 2.19 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో భారతీయ నటిగా ఆమె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.