ఘజియాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం, వేధింపులపై కేసు నమోదు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తీవ్ర వేధింపులు తాళలేక 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థి, అతని కుటుంబ సభ్యుల వేధింపులు, బెదిరింపుల కారణంగానే బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.