యువత భవితకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం - ఎమ్మెల్యే బేబీనాయన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని అచ్చీవర్ స్టడీ హాల్ను ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు సందర్శించారు. డీఎస్సీపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపడుతోందని ఆయన యువతకు భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నియోజకవర్గంలోని కోచింగ్ సెంటర్లను సందర్శిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.