వినాయకుడికి మోదకాలు, ఉండ్రాళ్లు ఎందుకు ఇష్టం? వెనుక ఉన్న కథేంటి?

రిపోర్టర్: గోపి స్థలం: భారతదేశం

వినాయక చవితి వేడుకల్లో గణపతికి మోదకాలు, ఉండ్రాళ్లు, లడ్డూలు అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలుగా సమర్పిస్తారు. బాల గణేషుడి ఆకలిని అనసూయాదేవి కుడుముతో తీర్చినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. అప్పటి నుంచే వినాయకుడికి 21 కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టే ఆచారం ప్రారంభమైంది.