నిరుద్యోగులకు భరోసా: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
రిపోర్టర్: నరేష్
స్థలం: నల్గొండ
నల్లగొండ టీటీడీసీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున అభ్యర్థులందరికీ ఉచిత స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.