ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఒత్తిడి: సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యుల వెల్లడి

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

అధిక ఒత్తిడి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని, ఇది రుతుక్రమ సమస్యలతో పాటు సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేర్ హాస్పిటల్స్ వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రభా అగర్వాల్ వెల్లడించారు. పని ఒత్తిడి, జీవనశైలి మార్పులు పురుషులలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయని ఆకాశ్ హెల్త్కేర్ వైద్యురాలు డాక్టర్ తరుణ దువా తెలిపారు. ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.