యాదాద్రి జిల్లాలో విషాదం: బెట్టింగ్ యాప్ల బారినపడి యువకుడు ఆత్మహత్య

రిపోర్టర్: సురేష్ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్లకు బానిసై అప్పులపాలైన గంధమల్ల భరత్ అనే యువకుడు అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు. అప్పులు పెరిగిపోవడంతో తాను ముఖం చూపించలేకపోతున్నానని భార్యకు సూసైడ్ నోట్ రాసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.