ఫైనాన్స్ వేధింపులతో యువకుడు బలవన్మరణానికి యత్నం

రిపోర్టర్: శివ స్థలం: నెల్లూరు

కావలి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన దేవరకొండ సంజయ్ అనే యువకుడు మంగళవారం బలవన్మరణానికి యత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఫైనాన్స్ కంపెనీ వాయిదాల చెల్లింపుల ఒత్తిళ్లతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన హ్యాండ్ వాష్ లిక్విడ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.