గణేష్ ఉత్సవాల్లో డీజేలు, లౌడ్ స్పీకర్లపై హైకోర్టు కఠిన నిషేధం
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
తెలంగాణలో గణేష్ నవరాత్రి ఉత్సవాల వేళ హైకోర్టు ఆదేశాలతో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, లౌడ్ స్పీకర్లపై పూర్తి నిషేధం విధించారు. నివాస ప్రాంతాల్లో శబ్ద తీవ్రత 55 డెసిబుల్స్ దాటరాదని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, విద్యాసంస్థల చుట్టూ 100 మీటర్ల పరిధిని నో నాయిస్ జోన్‌గా ప్రకటించి, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.