ఎన్నికల కమిషనర్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో ఎన్ఎస్ యూఐ ఆకస్మిక నిరసన

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

ఓట్ల అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా మంగళవారం రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఆకస్మిక నిరసన చేపట్టినట్లు జాతీయ మీడియా ఇన్ఛార్జ్ రవి పాండే తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ ఆందోళనలో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.