విజయనగరం జిల్లాలో డిగ్రీ ప్రవేశాలపై యువత అనాసక్తి
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా కౌన్సెలింగ్‌లో ఆలస్యం కారణంగా విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలపై యువత అనాసక్తి చూపుతోంది. చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం, రాజాం, ఎస్.కోట కళాశాలల్లో ఇటీవల మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసినప్పటికీ చాలాచోట్ల సగం సీట్లు కూడా భర్తీ కాలేదని చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచారిణి సీహెచ్ లలిత తెలిపారు.