స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు: అభ్యర్థుల వ్యయ పరిమితి ఖరారు

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఖరారు చేసినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యుడు రూ. రెండు లక్షలు, మున్సిపాలిటీ వార్డు సభ్యుడు రూ. ఒకటిన్నర లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.