అసాంఘిక మూకల గుండెల్లో సింహస్వప్నమై మారిన పోలీసుల నిఘా

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

చిట్వేల్ మండలంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టి శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా తనిఖీలు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ పర్యవేక్షణలో మల్లెంపల్లి, జట్టివారిపల్లి, సీఎంరాచపల్లి గ్రామాల్లో పేకాట, కోళ్ల పందేలు, గంజాయి తావలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ వినోద్కుమార్ స్పష్టం చేశారు. మండలవ్యాప్తంగా ఈ డ్రోన్ తనిఖీలను విస్తరిస్తామని, అసాంఘిక శక్తులపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చి పూర్తిగా సహకరించాలని కోరారు.