అంబుజా సిమెంట్స్ భారీ విస్తరణ: రూ.14,500 కోట్లతో నూతన ప్రాజెక్టుల ప్రకటన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
దేశీయ మార్కెట్ లో తన వృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో అంబుజా సిమెంట్స్ సంస్థ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సుమారు పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారీ మూలధన వ్యయంతో ముప్ పై మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ఆదాని గ్రూప్ సిమెంట్ వ్యాపార సీఈవో వినోద్ బహేటి వెల్లడించారు. ఈ సరికొత్త విస్తరణ ప్రాజెక్టులతో భవిష్యత్తులో కంపెనీ మొత్తం సామర్థ్యం మరింత పెరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది.