బిహార్‌లో మద్యపాన నిషేధం ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగుతుంది: సామ్రాట్ చౌదరి

రిపోర్టర్: గోపి స్థలం: బిహార్

బిహార్‌లో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తారన్న ప్రచారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిషేధం వల్ల సగం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని, నేరాల రేటు కూడా గణనీయంగా తగ్గిందని ఆయన తెలిపారు. తనపై వచ్చే ఆరోపణలు ఒక్కటి రుజువు చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.