'నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు': కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలు ఉద్యోగం తొలగింపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కర్ణాటక

కర్ణాటకలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వైద్యురాలిగా కొనసాగుతూ ప్రైవేట్ కాలేజీలో పీజీ చదువుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేశ్ మేతి మేనకోడలు అంకిత యరగల్‌ను బాగల్‌కోట్ అధికారులు విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వ నమ్మల్ క్లినిక్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ జీతం తీసుకుంటున్న ఆమె, మార్చి నుంచి విధులకు గైర్హాజరై ప్రైవేట్‌గా చదువుతున్నట్లు గుర్తించిన జిల్లా ఆరోగ్య అధికారి ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.