అభివృద్ధి కోసమే చిరువ్యాపారుల తొలగింపు చర్యలని స్పష్టం చేసిన చైర్మన్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో భాగంగానే చిరువ్యాపారుల డబ్బాలను తొలగించడం జరిగిందని మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ స్పష్టం చేశారు. ఆసుపత్రికి రెండో గేటు ఏర్పాటు, పార్కింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వంకు లేదని, ప్రజలందరూ ఆమనగల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.