జూలూరుపాడు మండలంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతన్నల హర్షం

రిపోర్టర్: bhukya Narasimha rao స్థలం: జులూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు రైతన్నల మోముల్లో ఆనందాన్ని నింపాయి. మిర్చి, పత్తి, వరి, పప్పు దినుసుల సాగుకు ఈ వర్షాలు ఎంతో మేలు చేకూర్చాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోతున్న పంటలకు ఈ వానలు ప్రాణం పోశాయని, దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల సాగు పనులు వేగవంతం కావడంతో మండలంలో వ్యవసాయ వాతావరణం నెలకొంది.