ఎన్‌బీఏ స్టార్ కవై లెనార్డ్ పై ఫెడరల్ దర్యాప్తు షురూ!
రిపోర్టర్: హరి
స్థలం: World
లాస్ ఏంజెల్స్ క్లిప్పర్స్ ఎన్‌బీఏ కాంట్రాక్ట్ వివాదంలో సంచలనం చోటుచేసుకుంది. స్టార్ ప్లేయర్ కవై లెనార్డ్ వ్యవహారాలపై అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు. జీతం పరిమితి నిబంధనలను ఉల్లంఘించి అక్రమ ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలపై ఇప్పటికే క్లిప్పర్స్ జట్టుకు భారీ జరిమానా పడగా, ఇప్పుడు ఈ కేసు ఫెడరల్ విచారణ స్థాయికి చేరడం క్రీడా వర్గాల్లో కలకలం రేపింది.