కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత: మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా గుమిగూడిన టీడీపీ శ్రేణులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ప్రియాంక బీ-ఫారమ్ సమర్పించేందుకు సిద్ధం కాగా, దానిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా గుమికూడటంతో టెన్షన్ వాతావరణం నెలకొందని అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల పర్వంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణలు తలెత్తుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.