గిరిజన విద్యార్థినికి ఆర్థిక సాయం: రూ.50 వేలు అందజేసిన కేసీఆర్ భరోసా

రిపోర్టర్: నరేష్ స్థలం: Tadwai

పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న తాడ్వాయి మండలం వీరాపూర్కు చెందిన గిరిజన విద్యార్థిని శృతి ఆవేదనపై స్పందించి ఆర్థిక సాయం అందించినట్లు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన విజ్ఞప్తిని పరిశీలించి రూ.50 వేల సాయం అందజేసినట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.