నూతన పార్కు ప్రారంభంతో గోదావరిఖని ప్రజల్లో పెల్లుబికిన ఆనందం
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన పార్కును సోమవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.