తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: హరి స్థలం: Amaravati

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్గా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బాపట్ల - విశాఖపట్నం మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఈ తుఫాను ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.